ఆమెను మర్చిపోలేకపోతున్న అల్లు వారబ్బాయి..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాలను కొనసాగిస్తుంటే మరికొంతమంది పెళ్లికి ముందే ప్రేమలో పడి డేటింగ్ చేసి ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లికి ముందే ప్రేమలో ఉండి డేటింగ్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ఇలా ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ ఇండస్ట్రీలో కూడా కొనసాగుతోంది. ఇప్పుడు మరో హీరో కూడా అదే బాటలో నడుస్తున్నారని చెప్పాలి.

Allu Sirish and Anu Emmanuel's upcoming film titled Prema Kadanta | Telugu  Movie News - Times of India

ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు పెళ్లి చేసుకుంటే ఎక్కువకాలం ఉండరు అని కొంతమంది నమ్మకంగా చెబితే మరికొంతమంది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కలిసి ఉంటారు అంటూ నిరూపిస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రీలో వాళ్ళని పెళ్లి చేసుకొని తాము కలిసే ఉంటాము అంటూ నిరూపిస్తున్నారు. ఇకపోతే అల్లు శిరీష్ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వడానికి సిద్ధం అవుతున్నారు.

Allu Sirish to romance Anu Emmanuel in 'Prema Kadanta'

ఈ క్రమంలోని మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అను ఇమ్మానియేల్ ఈ సినిమా తర్వాత నటించిన ఏ సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. మొన్నా మధ్య అను ఇమ్మానుయేల్, అల్లు శిరీష్ జంటగా నటించిన ఊర్వశివో.. రాక్షసివో సినిమా కూడా తాజాగా విడుదలై వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో వేరే లెవెల్ అనిపించేలా నటించారు. ఇక ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోయినా సరే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న వార్తలు మాత్రం గుప్పుమన్నాయి.

 

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లాగే అల్లు శిరీష్ కూడా సడన్గా పెళ్లి అంటూ తీసుకొచ్చి ప్రేమ పెళ్లి చేసుకుంటాడా అంటూ అభిమానులు కూడా చర్చిస్తున్నారు. అయితే సన్నిహితుల నుంచి వస్తున్న మాట ఏమిటంటే ప్రస్తుతం కుర్రాడు కెరియర్ పైన ఫోకస్ చేశాడని.. పెళ్లి ఆలోచన లేదని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.