అలియా భ‌ట్ సింప్లిసిటీ.. కెమెరామెన్ చెప్పును చేతితో ప‌ట్టుకుని ఏం చేసిందో తెలిస్తే షాకే! (వీడియో)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో అలియా భ‌ట్ ఒక‌టి. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. క‌థ‌ల ఎంపిక‌లో చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించి బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌తో స్టార్ హోదాను అందుకుంది. గ‌త ఏడాది విడుద‌లైన ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`తో అలియా భ‌ట్ తెలుగు ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే ర‌ణ‌బీర్ క‌పూర్ తో పెళ్లి పీట‌లెక్కిన అలియా భ‌ట్‌.. గ‌త ఏడాది పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పెళ్లై ఓ బిడ్డ‌కు త‌ల్లైనా స‌రే కెరీర్ ను స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తున్న అలియా భ‌ట్‌.. త్వ‌ర‌లోనే `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఎంత ఎదిగినా ఒదిగే ఉండ‌టం అలియా భ‌ట్ నైజాం. తాజాగా ఆమె సింప్లిసిటీ మ‌రోసారి బ‌ట‌య‌ప‌డింది.

ముంబైలోని ఒక ఏరియాకి త‌న త‌ల్లితో వచ్చిన అలియా భ‌ట్‌ను ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ఎగ‌బ‌డ్డారు. అలియా కూడా ఇబ్బంది ప‌డ‌కుండా ఫోటోల‌కు పోజులిచ్చింది. అయితే అలియాను ఫోటోలు తీసే కంగారులో ఒక ఫోటోగ్రాఫర్ చెప్పు కాలు నుంచి జారిపడిపోయింది. ఇది గ‌మ‌నించిన అలియా ఎలాంటి మొహ‌మాటం ప‌డ‌కుండా ఆ చెప్పుని తన చేతితో స్వ‌యంగా తీసి అతడి దగ్గరికి తీసుకెళ్లి మ‌రీ ఇచ్చింది. అలియా భ‌ట్ తీరుకు అక్క‌డ ఉన్న వారంతా షాకైపోయారు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. అలియా సింప్లిసిటీకి ఫిదా అవుతూ ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.