శ్రీకాళహస్తి ఆలయంలో చేయ‌కూడ‌ని త‌ప్పు చేసేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. భ‌క్తులు ఫైర్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీకాళహస్తి ఆలయంలో చేయ‌కూడ‌ని త‌ప్పు చేసి భ‌క్తుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల `విరూపాక్ష‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లోనే `బ్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. సుముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశాడు.

త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ `వినోద‌య సీతం`కు రీమేక్ ఇది. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. బ్రో విడుద‌ల సంద‌ర్భంగా సాయి ధ‌ర‌మ్ తేజ్ దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న అనంతరం కాణిపాకంకు వెళ్లాడు. అక్కడి నుంచి శ్రీకాళహస్తికి వెళ్లిన తేజ్‌.. ఒక్క త‌ప్పుతో హెడ్ లైన్స్ లో నిలిచాడు.

శ్రీకాళహస్తిలో శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. అక్క‌డ దేవుడికి స్వయంగా హారతి ఇచ్చాడు. ఇదే ఇప్పుడు వివాదం అయింది. ఆలయ నియమనిబంధనల ప్రకారం అర్చకులు మాత్రమే స్వామివారికి హారతులివ్వాలి. కానీ, సాయి ధ‌ర‌మ్ తేజ్ రూల్ ను బ్రేక్ చేసి దేవుడికి హార‌తి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌కు రావ‌డంతో భ‌ర్త తేజ్ తో పాటు ఆలయ అధికారులపై ఫైర్ అవుతున్నారు. ఆలయ నియమాలకు విరుద్దంగా తేజ్ చేత ఎలా దేవుడికి హార‌తి ఇప్పించారంటూ మండిప‌డుతున్నారు. మ‌రి ఈ వివాదంపై తేజ్ మ‌రియు ఆల‌య అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.