ప్రాజెక్ట్ -K సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రాలలో ప్రాజెక్ట్ -K చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు కేవలం ప్రాజెక్ట్ -K అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టడం జరిగింది. దీని అర్థం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయానికి తెర దింపే విధంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం జరిగింది ఈనెల 20 నుంచి 23 వరకు.. శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్ జరగబోతోంది.

Project K': Makers offer FREE merchandise of Prabhas, Deepika Padukone's  film for fans - India Today

శాన్ డియాగో కామిక్ కామ్ లో పాల్గొనబోతున్న మొదటి ఇండియన్ మూవీ గా ప్రాజెక్ట్-K సినిమా రికార్డు గా నిలుస్తోంది.శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్లో ప్రభాస్ దీపిక కమలహాసన్ తో పాటు పలువురు నిర్మాతలు కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.అక్కడే ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ అండ్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. యూఎస్ఏ లో జులై 21 తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

భారత కాలమానం ప్రకారం జులై 21న ప్రాజెక్ట్-K చిత్రానికి సంబంధించి టైటిల్ ఫస్ట్ ప్రోమో ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు టైటిల్ టీజర్లో ప్రభాస్ అమితాబచ్చలను చూడొచ్చు అన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ లక్ ఎలా ఉంటుంది అనే అంచనాలు అభిమానుల మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. గత మూడు చిత్రాలలో ప్రభాస్ లుక్ పరంగా అభిమానులను నిరాశపరిచారు. మరి ఈ చిత్రంలో నైనా ప్రభాస్ బెస్ట్ లుక్ అవుతుందని నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.