రోజుకో ట్విస్ట్..వాలంటీర్లే టార్గెట్..పవన్‌కు ప్లస్ అదే.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్…వాలంటీర్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ నేతలు బూతులు తిట్టిన, వాలంటీర్లు దిష్టి బొమ్మలు తగలబెట్టిన..పవన్ మాత్రం తాను చేసే విమర్శల పదును ఏ మాత్రం తగ్గించడం లేదు. వాలంటీర్లని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాగే రోజుకో కొత్త అంశంపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తణుకులో వారాహి యాత్ర నిర్వహించిన పవన్…జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో 219 దేవాలయాలపై దాడులు జరిగాయని, ‘రామతీర్థంలో రాముని విగ్రహాన్ని నరికేశారని,  అంతర్వేదిలో రథం తగులబడిందని, అయినా ఇప్పటివరకు నేరస్థులను పట్టుకోలేదని,  హిందూ ధర్మమంటే చులకనగా ఉందా? అని నిలదీశారు. రాష్ట్రంలో రూ.8వేల కోట్ల విలువైన ప్రైవేటు భూములు జగన్‌ దోచుకున్నారన్నారని విమర్శించారు.

అలాగే తణుకులో టీడీఆర్‌ బాండ్ల జారీలో రూ.309కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వలంటీర్లకు రూ.725 కోట్లతో సత్కారం చేస్తారు గానీ, పంచాయతీ కార్యదర్శులకు, చిరుద్యోగులకు నెలకు సక్రమంగా వేతనాలు మాత్రం ఇవ్వలేరని ఫైర్ అయ్యారు. సొంత వ్యవస్థలుగా వలంటీర్లను మార్చుకుని వారికి ప్రజాధనం వేతనాలుగా ఇస్తున్నారని, సచివాలయాలకు ఇప్పటిదాకా రూ.2700కోట్లు ఇచ్చాడని, మరి పంచాయతీలకు సొమ్ములు ఎందుకివ్వడం లేదు? అని ప్రశ్నించారు. ఇలా రోజుకో అంశంతో వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అయితే వాలంటీర్లని, సచివాలయాలని టార్గెట్ చేయడంతో జనసేనకు వాలంటీర్ల ఓట్లు 2.60 లక్షలు, సచివాలయ ఉద్యోగుల ఓట్లు లక్షా 20 వేల ఓట్లు పడవని విశ్లేషణలు వస్తున్నాయి.

అసలు వారు ఎలాగో వైసీపీకే ఓట్లు వేస్తారని..కాబట్టి వారి ఓట్లపై తమకు ఆశలు లేవని, కానీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా ఉన్న దాదాపు 20 లక్షల యువత తమకు ముఖ్యమని అంటున్నారు. వారి ఓట్లే జనసేనకు ప్లస్ అవుతాయని అంచనా వేస్తున్నారు.