టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి..పవన్ మాట..బాబు బాట.!

వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలుస్తాయని ఆశిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా ఎండీయీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బి‌జే‌పితో పొత్తులో ఉండటంతో పవన్ ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టి‌డి‌పికి ఆహ్వానం రాలేదు.ఎందుకంటే టి‌డి‌పి..బి‌జే‌పితో కలిసి లేదు.

కానీ మూడు పార్టీలు కలిస్తేనే అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడతామని పవన్ అన్నారు. అలాగే ఎన్నికల్లో గెలిచాక అప్పుడు బలాబలాల బట్టి సి‌ఎం అభ్యర్ధి ఎవరనేది నిర్ణయించుకోవాలని, తనకు సి‌ఎం పదవి ముఖ్యం కాదని చెప్పుకొచ్చారు. ఇక తమతో కలవాలా? లేదా? అనేది టి‌డి‌పి ఇష్టమని అన్నారు. దీంతో బంతి చంద్రబాబు కోర్టులోకి వచ్చింది. ఇక ఖచ్చితంగా బి‌జే‌పి-జనసేన కలిసి ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక వారితో టి‌డి‌పి వెళ్ళి కలవాలి.

అదే సమయంలో టి‌డి‌పితో పొత్తు ప్రసక్తి లేదని బి‌జే‌పి అంటుంది. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు పెట్టుకుంటే తమకే నష్టమని, రాష్ట్రానికి అన్యాయం చేసిన బి‌జే‌పితో కలిసి వెళితే నష్టం జరుగుతుందని, ఆటోమేటిక్ గా అది వైసీపీకి లాభం చేస్తుందని అంటున్నారు. అయితే ఏ నిర్ణయమైన బాబు తీసుకోవాలి. కానీ టి‌డి‌పికి పవన్ డిమాండ్లు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పికి ఒక శాతం ఓటింగ్ మాత్రమే ఉంది. ఇటు జనసేనకు 10 శాతం వరకు ఉండవచ్చు. కానీ 40 శాతం వరకు బలం ఉన్న టి‌డి‌పికి డిమాండ్లు పెట్టడం ఆశ్చర్యమే.

ఇక దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడారా? ఎన్నికల సమయంలోనే మాట్లాడతారా? అంటే చూడాలి బాబు పొత్తులపై ఎలాంటి బాటలో వెళ్తారో.