రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష.. కారణం ఏమిటంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు రాజశేఖర్ ఆయన భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక వీరి కూతుర్లు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలు సినిమాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. తాజాగా రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష పడినట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Rajasekhar is stable, Jeevitha tests negative for Covid-19 and discharged, says hospital - India Today

పరువు నష్టం కేసులు సినీ నటుడు రాజశేఖర్ జీవిత దంపతులకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధిస్తూ..17 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటీ మేజిస్ట్రేషన్స్ సాయి సుధా మంగళవారం సంచలన తీర్పును తెలియజేయడం జరిగింది.. చిరంజీవి బ్లడ్ బ్యాంకు పైన రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసుని దాఖలు చేయడం జరిగింది.. దీంతో రాజశేఖర్ జీవిత దంపతులకు నాంపల్లి కోర్టు జైలు శిక్షతోపాటు ఐదు వేల జరిమానా విధించింది కేసు పూర్వపరాల్లోకి వెళితే..

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత రాజశేఖర్ ఆరోపించినట్లు సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు..చిరంజీవి పేరుతో నడుస్తున్న ఈ సేవా కార్యక్రమాల పైన ట్రస్టు పైన అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్ట ధావం వేయడం జరిగింది. వారు చేసిన ఆరోపణలకు సంబంధించి వీడియోతో పాటు మీడియాలో కూడా పలు కథలు వినిపించాయి. ఈ కథనాలను కోర్టుకు సమర్పించారు.ఈ సుదీర్ఘ విచారణ అనంతరం రాజశేఖర్ జీవిత దంపతులకు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. జరిమానా చెల్లించడంతో ఈ తీర్పు పైన జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించారు. మరి హైకోర్టు అబ్దుల్ కు అవకాశం ఇస్తే బెయిల్ మంజూరు చేస్తుందేమో చూడాలి మరి