పొలిటికల్ పై ఎన్టీఆర్ అలా.. అభిమానులు ఇలా..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గతంలో కంటే భారీగా పెరిగిపోయింది..RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా ఇతర భాషలలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు, తను మాట్లాడే మాటలు కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్లిన అక్కడ ఆ భాషలో మాట్లాడుతూ అభిమానులను మెప్పిస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కుటుంబానికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Happy Birthday Jr NTR: Adorable photos of RRR actor with wife Lakshmi Pranathi, sons Abhay Ram-Bhargava Ram

ఇక ఎన్టీఆర్ రాజకీయాలపై కెరియర్ మొదట్లో ఆసక్తి ఉన్న ఇప్పుడు మాత్రం కేవలం సినిమాల పైన ఫోకస్ పెడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటున్నప్పటికీ.. ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల వైపు అసలు అడుగు వేయలేదు. గత కొద్దిరోజులుగా అక్కడక్కడ ఎన్టీఆర్ కు సంబంధించి ఫ్లెక్సీలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అంటూ ఒక ఫ్లెక్సీ ని కట్టడం జరిగింది టిడిపి అభిమానులు.

ఈ ఫ్లెక్సీలు ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసినవి కావని మరొక రాజకీయ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీలు వైరల్ అయిన ప్రతి సందర్భంలో ఎన్టీఆర్ సీఎం అయితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.. 2024 ఎన్నికల సమయం కొంతకాలం ఉండడంతో ఎన్టీఆర్ టీడీపీకి బహిరంగంగా మద్దతు ఇస్తారని చర్చ కూడా జరుగుతోంది. ఇక జ్యోతిష్యులు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ప్లానింగ్ కూడా బాగానే ఉందంటూ తెలియజేశారు.. అభిమానులు అయితే అలా ఉన్న ఎన్టీఆర్ ఇలా ఉండడంతో ప్రస్తుతం పలువురు నేతలు సందిగ్ధంలో ఉన్నారు.