మ‌హేష్ బ్యూటీ సీక్రెట్ లీక్‌.. రోజూ బ్రేక్‌ఫాస్ట్ లో ఆ రెండు ఉండాల్సిందే అట‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అందం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అందానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ ఆయ‌న‌. బాలీవుడ్ తార‌లు కూడా మ‌హేష్ బాబు అందానికి దాసోహం అంటుంటారు. యాభైకి చేరువ‌వుతున్నా చెక్కు చెద‌ర‌ని య‌వ్వ‌నంతో తోటి న‌టీన‌టుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటాడు.

మ‌హేష్ బాబు టీనేజీ వైబ్స్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు అంటే దాని వెన‌క ఆయ‌న క‌ష్టం ఎంతో ఉంది. వర్కౌట్స్ అనేవి ప్రతీ హీరోకి కామన్ గా ఉండేవే.. కానీ, మ‌హేష్ వ‌ర్కౌట్స్ తో పాటు డైట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాడు. అంద‌రూ తినేవే ఆయ‌న తింటారు. అయితే చాలా లిమిట్ గా తీసుకుంటాడు. డైరీ ఫుడ్స్ కాని.. ఫ్యాటీ ఫుడ్స్ కాని ద‌రిదాపుల్లోకి కూడా రానివ్వ‌రు.

తాజాగా తాను రోజూ మార్నింగ్ తినే బ్రేక్ ఫాస్ట్ గురించి మ‌హేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బ్రేక్ ఫాస్ట్ తింటున్న ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటున్న మ‌హేష్ బాబు.. `ఇది నా డైలీ రొటీన్. నైట్ అంతా నానబెట్టిన ఓట్స్, కొన్ని మొలకెత్తిన గింజలు, విత్తనాల్ని కలిపి తీసుకుంటాను. మ‌రి కొన్ని గంటల వరకు ఇవే నాకు పవర్ ని ఇస్తాయి` అని పేర్కొన్నాడు. దీంతో ఇద‌న్న మాట మ‌హేష్ బాబు బ్యూటీ సీక్రెట్‌.. అంత హెల్తీ ఫుడ్ ను తీసుకుంటాడు కాబ‌ట్టే ఆయ‌న అంత అందంగా, హెల్తీగా ఉంటార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `గుంటూరు కారం` సినిమా చేసిన మ‌హేష్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని రాజ‌మౌళితో ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు.