“ఇక పై అలాంటి వీడియోలు స్టేటస్ పెడితే జైలుకే”.. కొంప ముంచేసిన కేంద్రం కొత్త రూల్..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ లవర్స్ తమ ఫేవరెట్ హీరో ఫస్ట్ డే.. ఫస్ట్ షో కి వెళ్లి ఆ హీరోకి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ ను.. బ్యూటిఫుల్ వీడియోస్ ని.. ఎంట్రీ సీన్స్ మంచి మంచి డైలాగ్స్ రికార్డ్ చేసి మరి ఆ వీడియోలను స్టేటస్ గా పెట్టి ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలకు ముందే అందరికీ ఆ సినిమాలోని క్రేజీ పాయింట్స్ ని చెప్పే విధంగా ట్రై చేస్తున్నారు .అయితే కొన్ని కొన్ని సార్లు ఇది తప్పుదావ పట్టించే విధంగా కూడా ఉంటుందని.. పైరసీ ప్రమోట్ చేసే విధంగా ఉంది అని ..కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయంపై కన్నెర్ర చేసింది .

ఈ క్రమంలోనే రీసెంట్గా ప్రవేశపెట్టిన సినిమాటోగ్రఫీ బిల్లులో చేసిన సవరణ ప్రకారం ఇకపై ఎవరైనా సరే సినిమా థియేటర్స్ లో వీడియోలు రికార్డ్ చేస్తూ పట్టుబడితే కచ్చితంగా మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు అంటూ కొత్త రూల్ తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఇక ఎవరైనా సరే సినిమా పైరసీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.

సినిమా థియేటర్లో వాట్సాప్ స్టేటస్ కోసం సెల్ ఫోన్లో రికార్డింగ్ చేస్తూ పట్టుబడిన జైలుకు వెళ్లాల్సి వస్తుంది . అంతేకాదు పైరసి రికార్డ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా విధిస్తారు . అంతేకాదు సినిమా నిర్మానానికి ఖర్చు అయిన మొత్తం ఐదు శాతం కట్టాల్సి ఉంటుంది . ఇకపై థియేటర్స్ లో ఫోన్ ఆన్ చేయాలంటే భయపడి పోవాల్సిందే ప్రజలు జనాలు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అనధికారికంగా సోషల్ మీడియాలో ఆ వీడియోలు ప్రసారం కాకుండా ఆపడమే ఈ సవరణ ముఖ్య ఉద్దేశం అంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది ..!!