పెళ్లయిన తర్వాత రూట్ మార్చనున్న లావణ్య త్రిపాఠి.. సినిమాలను వదిలేసి ఏం చేస్తుందంటే…

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు త్వరలోనే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మేగా ఇంటి కోడలు కాబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే.  అయితే పెళ్లి కి ముందే ఈ అమ్మడు ఒక సంచలన నిర్ణయం తీసుకుందట. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

వరుణ్, లావణ్య ల పెళ్లి ఎప్పుడో కావాల్సింది కానీ నిహారిక విడాకుల కారణంగా లేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. నిహారిక మొదట తన విడాకుల నిర్ణయం ఇంట్లో చెప్పినప్పుడు మెగా ఫ్యామిలీ ఆగ్రహించిందట కానీ నిహారిక డేరింగ్ డెసిషన్ కు తమ మద్దతు ప్రకటించారు మెగా ఫ్యామిలీ.

తాజాగా టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది పెళ్లి కి ముందే లావణ్య కు కండిషన్స్ పెట్టారంటూ వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. పెళ్లి తరువాత లావణ్య సినిమా ల్లో నటించకూడదని, ఒక వేళ నటించినా, ఎక్సపోసింగ్ మరియు గ్లామరస్ పాత్రల్లో నటించడానికి వీలు లేదని చెప్పారంట.
లావణ్య మాత్రం పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరం కానుందట, లావణ్య కు భరత నాట్యం లో మంచి ప్రావీణ్యం ఉంది. వరుణ్ తో పెళ్లి తరువాత తను పూర్తిగా భరత నాట్యం మీద దృష్టి పెట్టి ఇంకొంత మందికి భరత నాట్యం నేర్పించనుంది ఈ అందాల రాక్షసి. లావణ్య తీసుకున్న నిర్ణయానికి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వదిన నిర్ణయం సూపర్ అంటూ నెట్టింట్లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.