అప్పుడు సాయి ప‌ల్ల‌వి..ఇప్పుడు శ్రీ‌లీల.. ఇద్దరిలో ఉన్న ఈ కామ‌న్ పాయింట్ ఇదే.. అందుకే డైరెక్టర్స్ ఎగబడుతున్నారా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ.. క్రేజ్ సంపాదించుకున్న శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో 12 సినిమాలు కు పైగానే పెట్టుకొని మరిన్ని క్రేజీ ఆఫర్స్ ని హోల్డ్ లో పెట్టుకున్న శ్రీలీల అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోస్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – విజయ్ దేవరకొండ ఇలాంటి స్టార్ హీరోలు కూడా శ్రీలీలతోనే సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

అయితే దీని అంతటికి కారణం ఆమె అందం అంటూ కొందరు చెప్పుకొస్తుంటే కాదు కాదు ఆమె టాలెంట్ అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీలీలకి అందం, టాలెంటే కాదు శ్రీలీలకి ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువ అని అందుకే శ్రీలీలతో సినిమాలు చేయడానికి ఫ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఆమె డెడికేషన్ సిన్సియారిటీ డైరెక్టర్ ల కు చాలా నచ్చేసింది.

ఈ క్రమంలోనే అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆమెను సినిమాలో పెట్టుకుంటున్నారు. అయితే సేమ్ టు సేమ్ ఇదే క్వాలిటీస్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి లోను ఉండేవని ఆమె డ్యాన్స్.. ఆమె నటన.. ఆమె సింప్లిసిటీ అంటే స్టార్ హీరోలు బాగా లైక్ చేశారని.. ఇప్పుడు అదే క్వాలిటీతో ఉన్న శ్రీలీల సైతం అదే టాప్ పొజిషన్ అందుకుంటుందని చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల సాయి పల్లవి పేర్లు వైరల్ గా మారాయి..!!