ఈ ఒక్క డైరెక్టర్ వల్ల అన్ని కోట్లు నష్టపోయిన నిర్మాతలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మెహర్ రమేష్ పేరు వినగానే నిర్మాతలు సైతం భయభ్రాంతులకు గురవుతారు.. మెహర్ రమేష్ డైరెక్షన్లో తక్కువ సినిమాలే వచ్చినప్పటికీ ఆ సినిమా హీరోలుగా నటించిన వాళ్ల కెరియర్ మాత్రం డిజాస్టర్ గానే మిగిలిందని చెప్పవచ్చు.. మెహర్ రమేష్ మొదట పూరి జగన్నాథ్ దగ్గర పనిచేసిన తర్వాత ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాతో తన కెరియర్ ని మొదలుపెట్టారు.. కానీ ఈ చిత్రంలో ప్రభాస్ స్టైల్ మేకోవర్ని మార్చడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అభౌవ్ యావరేజ్ గా మిగిలింది.

Mega Fans worried about Meher Ramesh

ఆ తర్వాత ఎన్టీఆర్ తో కంత్రి ,శక్తి సినిమాలను తెరకెక్కించి ఘోరమైన డిజాస్టర్ లను మూట కట్టుకున్నాడు.. ఆ తర్వాత వెంకటేష్ తో కలసి షాడో సినిమాని తెరకెక్కించారు ఈ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ని చవి చూశాయి.. ఈ డైరెక్టర్ వల్ల టాలీవుడ్ నిర్మాతలకు అప్పట్లోనే దాదాపుగా 50 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు వచ్చాయని వార్తలు వినిపిస్తూ ఉండేవి. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ 50 కోట్లు 200 కోట్లకు పైగా సమానమని తెలుస్తోంది.

Meher Ramesh: Bholaa Shankar is a gift for fans this Chiranjeevi's birthday

ప్రస్తుతం చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాని నిర్మించడం జరిగింది.. ఈ డైరెక్టర్ వల్ల ఈ సినిమాకి పెద్దగా బిజినెస్ కాలేదని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అవుతూనే తనేంటో ప్రూఫ్ చేసుకోవాల్సి ఉందంటూ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. మరి తన పైన వస్తున్న విమర్శలకు గడ్డి సమాధానం దొరుకుతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే వచ్చే నెల 11 వరకు ఆగాల్సిందే.