సమంత మనసులో మళ్ళీ ప్రేమ పుట్టిందా..? లెటేస్ట్ పోస్ట్ తో అభిమానులకి ఊహించని షాక్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయం నైనా ఇట్టే ధైర్యంగా పరోక్షకంగా చెప్పడానికి సిద్ధపడుతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ , మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డివర్స్ తీసుకున్న జంటలు అందరూ ఒకరి మీద ఒకరి కోపాన్ని సోషల్ మీడియా ద్వారానే బయటపడుతూ వచ్చారు. కాగా హీరోయిన్ సమంత కూడా అదే విధంగా తనలోని బాధను ఎక్స్ప్రెస్ చేసేస్తుంది .

రీసెంట్గా హీరోయిన్ సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట పలు అర్థాలకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో సమంత ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేస్తూ వస్తుంది అన్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్ గా సమంత..”కొన్నిసార్లు మీరు ద్వేషం గురించి ఎక్కువగా వింటూ ఉంటారు.. కానీ ఈ ప్రపంచంలో మీరు ఊహించగలిగే దానికంటే ఎక్కువ ప్రేమ కూడా ఉంది “అంటూ రాసుకొచ్చింది.

అయితే ఇది చదివిన కొందరు మళ్లి సమంత ప్రేమలో పడింది అని చెప్పుకొస్తూ ఉంటే ..మరి కొందరు సమంత పరోక్షకంగా నాగచైతన్యకు కౌంటర్ వేసిందని ..ఆయన ఒక్కడే సమంతని ద్వేషిస్తే తనను ప్రేమించడానికి మిగతా జనాలు లేరా..? అన్న కోణంలో ఈ నోట్ పోస్ట్ చేసింది అని చెప్పుకొస్తున్నారు . అయితే సమంత ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టిందో కానీ సమంత చెప్పింది నూటికి నూరు శాతం నిజం అంటున్నారు అభిమానులు..!!