గుడివాడలో ట్విస్ట్‌లు..రాము కాదు..రావి.!

గుడివాడలో కొడాలి నానిని ఢీకొట్టే ప్రత్యర్ధి ఎవరు? ఇది గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం. గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసే టి‌డి‌పి నేత ఎవరనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్ధులని మార్చిన కొడాలిని ఓడించలేకపోయారు. ఎందుకంటే కొడాలికి గుడివాడపై పట్టు అలా ఉంది. 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన కొడాలి..సొంతంగా బలం పెంచుకున్నారు.

ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. సొంత బలం ప్లస్..వైసీపీ బలంతో 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. మొదట విడత మంత్రిగా చేశారు. ఇక మళ్ళీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి విజయం సాధించడం ఖాయమని అన్నీ సర్వేలు చెబుతున్నాయి. ఆఖరికి టి‌డి‌పి సర్వేల్లో కూడా అదే తేలింది. అంటే కొడాలిని ఓడించడం టి‌డి‌పికి సాధ్యమయ్యే పని కాదు. ఇక కొడాలిపై ఈ సారి ఎలాగైనా బలమైన ప్రత్యర్ధిని పెట్టి ఓడించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే అభ్యర్ధి విషయంపై ఇప్పటికే పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి.

గుడివాడ టి‌డి‌పి ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..అటు ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము ఊన్నారు. అలాగే పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, శిష్ట్లా లోహిత్ ఉన్నారు. అయితే ఇందులో ప్రధాన పోటీ రావి, రాము మధ్యే ఉంది. ఇక రాము కమ్మ, ఆయన భార్య ఎస్సీ, పైగా గుడివాడలో సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఆర్ధికంగా బలవంతుడు. అందుకే రాముకే సీటు ఇస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది.

కానీ రావికి మొదట నుంచి సీటు విషయంలో అన్యాయం చేస్తున్నారు. 2004లో కొడాలి నాని కోసం రావి సీటు త్యాగం చేశారు.2019లో దేవినేని అవినాష్ కోసం సీటు త్యాగం చేశారు. వారు వైసీపీకి వెళ్ళిన రావి మళ్ళీ టి‌డి‌పికి దిక్కు అయ్యారు. ఇక ఆయనకు గ్రామ స్థాయిలో పట్టు ఉంది. రాముకు అంత పట్టు లేదు. దీంతో రావికే సీటు ఇస్తే కాస్త కొడాలికి పోటీ ఉంటుందని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఆయనకే సీటు దక్కుతుందనే ప్రచారం ఉంది. చూడాలి మరి చివరికి గుడివాడ టి‌డి‌పి సీటు ఎవరికి దక్కుతుందో.