బ్రో మూవీలో ప్లస్, మైనస్ పాయింట్స్‌ ఇవే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ‘బ్రో’ సినిమా సందడి చేస్తుంది. 2 గంటల 15 నిమిషాల నిడివి తో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక విందు భోజనం లాంటిదని చెప్పాలి. అయితే ‘వినోదయసిత్తం’ సినిమాతో పోల్చి చూస్తే మాత్రం బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసారు.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ బ్రో సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ లేవని చెప్పాడు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, తమన్ BGM విషయంలో మాత్రం అదరగొట్టేసాడనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్,సాయిధరమ్ తేజ్ నటన విషయం లో ఇరగదీసారు. అలానే కొన్ని సీన్స్ లో పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ తో ప్రయోగం చేశారు. అది కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఎక్కడా ల్యాగ్ లేకుండా తక్కువ సమయంలోనే సినిమా పూర్తి కావడంతో ప్రేక్షకులందరికీ సినిమా చూసాం అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది.

సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్వించేలా చేసింది. అది కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా చూసిన ఆడియన్స్ అందరూ బ్రో సినిమా హిట్ అనే చెప్తున్నారు. అయితే సినిమా మొత్తం బాగున్నప్పటికీ స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల, ఒరిజినల్ స్టోరీలోని ఫీల్ ని మిస్ అయ్యేలా చేసారు దర్శకుడు. అలానే కథలో అసలు ఏ మాత్రం అవసరం లేని కొన్ని క్యారెక్టర్లను హైలెట్ చెయ్యడం బ్రో సినిమాకి ఒక మైనస్ పాయింట్ అనే చెప్పాలి. అయితే చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మంచికి కిక్కెస్తుందనే చెప్పాలి.