వైలెన్స్ తో షేక్ చేస్తున్న కెప్టెన్ మిల్లర్ టీజర్..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడు కూడా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు.. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల అప్డేట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. గతంలో కూడా ఎన్నో భారత స్వతంత్ర వీరుల గురించి తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

CAPTAIN MILLER - Official Announcement Video | Dhanush | GV Prakash | Arun  Matheswaran - YouTube

ఇప్పుడు అలాంటి ఫ్రీడమ్ ఫైటర్ కదా అంశంతో వస్తున్న ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో విడుదల చేయడం జరిగింది.. ఈ చిత్రాన్ని అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు తాజాగా ధనుష్ బర్తడే సందర్భంగా కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది.. ఈ సినిమా పూర్తిగా కంప్లీట్ యాక్షన్ ఎపిసోడ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది వాంటెడ్ కెప్టెన్ మిల్లర్ అని పోస్టర్తో వీడియో మొదలవుతుంది ఈ పోస్టర్ ధనుష్ మడతపెట్టి జేబులో పెట్టుకోవడంతో ఈ టీజర్ ఎండ్ అవుతుంది.

 

మధ్యలో అదిరిపోయే రేంజ్ లో పవర్ఫుల్ యాక్షన్స్ అన్ని వేషాలు హైలెట్గా కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెల్ల దొరల నుంచి సామాన్య ప్రజలను ఎలా రక్షించుకున్నారు. ఒక గ్యాంగ్ లీడర్ గా ఎలా మారారు అనే కథ అంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. నటుడు శివరాజ్ కుమార్ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రియాంక అరుణ్ మోహన్ ఇందులో ఒక గిరిజన యువతి పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ఏకంగా మూడు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు సమాచారం టీజర్ అయితే ధనుష్ నుంచి నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ అన్నట్లుగా తెలుస్తోంది.