కారు డ్రైవ్ చేస్తూ క్యూట్‌గా న‌వ్వుతున్న ఈ స్టార్ హీరో ఎవ‌రో గెస్ చేస్తే మీరు జీనియ‌స్‌.. అంతే!

పైన ఫోటోలో బుల్లి నిక్క‌ర్ వేసుకుని కారు డ్రైవ్ చేస్తూ క్యూట్ గా న‌వ్వుతున్న కుర్రాడు ఎవ‌రో గెస్ చేశారా..? సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అత‌నొక‌డు. అత‌నికి లేడీ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. మ‌ల‌యాళ స్టార్ అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్ లో స్పెష‌ల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఇంకా గుర్తుకురాలేదా..? మలయాళ నటుడు మమ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ అండీ బాబు.

సెకండ్ షో అనే సినిమా ద్వారా దుల్క‌ర్ స‌ల్మాన్ సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. తొలి సినిమాతోనే అంద‌రి మ‌న‌సులు దోచేశాడు. ఆ త‌ర్వాత వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టిస్తూ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్డ‌మ్ ను ద‌క్కించుకున్నాడు. దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో కూడా సినిమాలు చేశాడు.

ఈయ‌న‌ నేరుగా చేసిన తొలి తెలుగు చిత్రం `మ‌హాన‌టి` మూవీలో న‌టించాడు. ఇందులో దివంగత నటుడు జెమినీ గణేశన్ పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. ఆ త‌ర్వాత `సీతారామం` చేశాడు. హ‌నురాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ ల‌వ్ స్టోరీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ప్ర‌స్తుతం కింగ్ ఆఫ్ కోటాతో పాటు మ‌రో మూడు ప్రాజెక్ట్ ల‌తో దుల్క‌ర్ బిజీగా ఉన్నాడు.