విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా బ్రేక‌ప్‌.. పెళ్లికి ముందే ప్రియుడు చుక్క‌లు చూపించాడా..?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ల‌స్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ షూటింగ్ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ ప‌రిచయం ప్రేమ‌గా మారింది. అయితే వీరి త‌మ ప్రేమ‌ను ఎక్కువ కాలం దాచ‌లేక‌పోయారు. ఈ ఏడాది ఆరంభం నుంచి విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ వార్త‌ల‌ను నిజం చేస్తూ ఇటీవ‌ల త‌మ‌న్నా విజ‌య్ వ‌ర్మ ప్రేమ‌లో ఉన్న‌ట్లు అంగీక‌రించారు. అలాగే త‌ర‌చూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ హెడ్‌లైన్స్ లో నిలుస్తున్నారు. ఇక రేపే మాపో వీరిద్ద‌రూ పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని న‌మ్మారు. కానీ, ఇంత‌లోనే వీరికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. విజ‌య్ వ‌ర్మ‌కు త‌మ‌న్నా బ్రేక‌ప్ చెప్పింద‌ట‌.

విజ‌య్ వ‌ర్మ అప్పుడే త‌మ‌న్నాకు బోర్ కొట్టేశాడ‌ట‌. పెళ్లికి ముందే విజ‌య్ వ‌ర్మ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో చుక్క‌లు చూపించాడ‌ట‌. దీంతో త‌ర‌చూ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం స్టార్ట్ అయ్యాడ‌ట‌. విజ‌య్ వ‌ర్మ తో రిలేష‌న్ ను ఇరిటేటింగ్ గా ఫీల్ అయిన త‌మ‌న్నా.. అత‌డితో విడిపోయింద‌ట‌. ఈ ఆరోప‌ణ‌లు చేసింది మ‌రెవ‌రో కాదు బాలీవుడ్ ఫిల్మ్ క్రిట‌క్ ఉమైర్ సంధు. నిత్యం సెల‌బ్రెటీల‌పై ఏదో ఒక వివాదాస్ప‌ద‌మైన ట్వీట్ చేస్తూ వార్త‌ల్లో నిలిచే ఉమైర్‌.. తాజాగా త‌మ‌న్నాను టార్గెట్ చేస్తూ ట్వీట్ వ‌దిలాడు. అది కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది. మ‌రి ఈ బ్రేక‌ప్ వార్త‌ల‌పై త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.