తిక్క సినిమా హీరోయిన్ తో లవ్ పై క్లారిటీ ఇచ్చిన తేజ్..!!

టాలీవుడ్ లో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. 2016లో తిక్క సినిమాలో హీరోయిన్గా నటించిన లారిస్సా బోనేసి… తో తేజ్ ప్రేమలో పడ్డారని గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. అయితే తన ప్రేమను కూడా ఆమెకు తెలియజేశాడని వార్తలు వినిపించాయి. 2021 లో సాయి ధరంతేజ్ బర్తడే రోజున ఈమె నేను ప్రేమలో ఉన్నానంటూ ట్విట్ చేయడం జరిగింది.. గత ఏడాది పుట్టినరోజున తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ టు మై డిస్టర్బ్యూషన్ అని ప్రేమగా రిప్లై ఇచ్చారు.

We all can't wait to see your smile again: Thikka Heroine To SDT

లారిస్సా బోనేసి మాత్రం ఎప్పటికీ నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటానంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా తేజ్ బ్రో సినిమాలో నటించారు.. ఈ సినిమా ప్రమోషన్స్లో పలు ఇంటర్వ్యూలలో పాల్గొనడం జరిగింది ఈ క్రమంలోనే తేజ్ అండ్ హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియాలో నేటిజెన్లతో ఇంట్రాక్ట్ అయ్యారు.. అలా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది.

ఇందులో ఒకరు తేజ్ ని లారిస్సా బోనేసి వదిన ఎలా ఉందన్నా అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు తేజ్ బదులు ఇవ్వకుండా కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత క్యూస్షన్ ఏంటి నాకు సరిగ్గా అర్థం కాలేదు అంటూ మళ్ళీ అడిగారు.. కోసం మళ్లీ రిపీట్ చేయగా మౌనం పాటించి క్యూస్షన్ అర్థం కాలేదు అంటూ బదులిచ్చాడు.. దీంతో కొంతమంది చేస్తున్నారంటూ కామెంట్లు చేయగా..లారిస్సా బోనేసి పేరులో ఉన్న వైబ్రేషన్ అలాంటిది అంటూ తెలియజేశారు ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.