రజనీకాంత్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?

కోలీవుడ్లో సూపర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే పేరు రజనీకాంత్.. సామాన్య కండక్టర్గా నుండి హీరోగా అంచలంచెలుగా ఎదిగి చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా పేరు సంపాదించారు.. వేలాదిమంది అభిమానులను సంపాదించు కున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. తెలుగు, హిందీ ,మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు.

5 PHOTOS of Rajinikanth with his loved ones that prove he is family man by  heart | PINKVILLA

జపాన్లో విపరీతమైన క్రేజీ సంపాదించిన రజనీకాంత్ ప్రస్తుత వయసు 72 సంవత్సరాలు ఇప్పటికీ సూపర్ స్టార్ గా ఉంటూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు.. 1975లో సినీ రంగంలో ప్రవేశించిన రజనీకాంత్ ఇప్పటికి తన హవా కొనసాగిస్తున్నారు..రజనీకాంత్ ఆస్తి విలువ విషయానికి వస్తే దాదాపుగా రూ.530 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. 2018 లో రూ.50 కోట్ల వార్షిక ఆదాయం ఉన్న జాబితాలలో రజనీకాంత్ 14వ స్థానంలో ప్లేసును సంపాదించారు.

ప్రస్తుతం జైలర్ సినిమా కోసం రూ .150 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులలో రజనీకాంత్ మాత్రమే ఉన్నారు. చైనాలోని పోయోస్ గార్డెన్ పరిసరాలలో ఒక భవనంతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తగా రాజకీయ సినీ ప్రముఖులలో సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు రజనీకాంత్.రజనీకాంత్ కి కార్లు అంటే చాలా ఇష్టం తన దగ్గర కొన్ని కోట్ల విలువ చేసే కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా వీటి విలువ 40 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తే ఇల్లు పొలాలు కూడా ఉన్నట్లు సమాచారం.