గుంటూరుపై జనసేన పట్టు..టీడీపీ ఇరుక్కునట్లే.!

రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలతో బి‌జే‌పి కలిసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. మూడు పార్టీలు కలిస్తే వైసీపీకే లాభం. ఎందుకంటే బి‌జే‌పికి ఉన్న యాంటీ..టి‌డి‌పిపై పడుతుంది. సరే ఆ విషయం పక్కన పెడితే..పొత్తులో భాగంగా ఏ ఏ సీట్లు ఏ పార్టీకి దక్కుతాయనేది పెద్ద చర్చగా మారింది.

ఎలాగో టి‌డి‌పి పెద్ద పార్టీ కాబట్టి…బి‌జే‌పి-జనసేనలకు ఆ పార్టీ సీట్లు త్యాగం చేయాలి. ప్రధానంగా జనసేనకు ఎక్కువ సీట్లు వదలాలి. అలా కాకుండా పొత్తులు లేకుండా ఉంటే ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీకే లబ్ది చేకూరుతుంది. ఇక జనసేన విశాఖ టూ గుంటూరు జిల్లాల వరకు ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన కొన్ని సీట్ల కోసం గట్టి పట్టు పట్టేలా ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు తెనాలి, గుంటూరు వెస్ట్, ఈస్ట్, ప్రత్తిపాడు, గురజాల లాంటి సీట్లలో కాస్త ఓట్లు బాగానే వచ్చాయి.

ఈ ఓట్లు చీలిక వల్ల..ఆయా స్థానాల్లో టి‌డి‌పి ఓడిపోయింది. ఈ సారి కూడా ఒంటరిగా వెళితే ఓట్లు చీలిపోయి టి‌డి‌పికే నష్టం. అందుకే పొత్తు వైపే మొగ్గు చూపవచ్చు. ఇక పొత్తులో భాగంగా జనసేన కొన్ని కీలక సీట్లు డిమాండ్ చేయవచ్చు. వాటిల్లో తెనాలి, గుంటూరు వెస్ట్ లేదా ఈస్ట్, ప్రత్తిపాడు సీట్లని అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ సీట్లని జనసేన వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇందులో తెనాలి మాత్రం నాదెండ్ల మనోహర్‌కు ఫిక్స్ అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సీటుని త్యాగం చేయడానికి టి‌డి‌పి కూడా రెడీగానే ఉంది. కానీ మిగిలిన సీట్ల విషయమే డౌట్. చూడాలి మరి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుందో.