జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఆగిపోయిన సినిమాలు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ హీరో గా జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉన్నారు.. తాత ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్..సింహాద్రి సినిమా సమయానికి అభిమానుల విషయంలో ఏకంగా చిరంజీవికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనం నుంచే స్టార్ డం అందుకున్నాడు. అప్పట్లో ఆది సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో చెప్పనవసరం లేదు. మొన్నటికి మొన్న RRR సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నాడు.

All you need to know about Jr NTR on his 39th birthday - India Today

అయితే సింహాద్రి సినిమా తరువాత కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా పూజా కార్యక్రమాలు జరుపుకొని ఆగిపోయిన సినిమాలు కూడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో నటించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో చెప్పనవసరమే లేదు.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాలని జూనియర్ ఎన్టీఆర్ భావించాడట..ఆ చిత్రానికి ప్రారంభోత్సవం కూడా చేశారు.. అయితే ప్రేక్షకులను మెప్పించలేదేమోనని ఆ సినిమాను ఆపేశారు.

నాగార్జున నటించిన ఊపిరి సినిమాని దర్శకత్వం వహించింది వంశీ పైడిపల్లి మొదట ఈ సినిమా కథని ఎన్టీఆర్కు చెప్పారట.. నెల రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుండగా ఈ సినిమా నుంచి తారక్ తప్పుకున్నాడు ఆయన స్థానంలో కార్తీక్ వచ్చాడు. ఈ పాత్ర ఆ సినిమాకి ఎంత ప్లస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో గరుడ అనే చిత్రాన్ని చేద్దామనుకున్నారు.. అయితే ఈ సినిమా కూడా చర్చల దగ్గరే ఆగిపోయింది. ఇవే కాకుండా పలు చిత్రాలు ఉన్నట్లు సమాచారం.