హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండకి ఆనందమే లేకుండాపోయిందే.. దరిద్రం అంటే ఇదే..!

కొన్నిసార్లు మనం కావాల్సింది మనం కోరుకున్నది చేతికి దక్కిన ఎందుకో ఆనందం పడలేం . రిజల్ట్స్ ఏవైనా కావచ్చు ..ప్రెసెంట్ అలాంటి ఓ టఫ్ సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ . రీసెంట్గా ఈ హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా బేబీ . హృదయ కాలేయం సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ ఎంతో కేర్ఫుల్ గా ఆలోచించి నేటి జనరేషన్ ఏ విధంగా ఉన్నారు ..ఏ విధంగా తప్పులు చేస్తున్నారో.. అనే అంశాన్ని తీసుకొని తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశారు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య.

కాగా ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . సినిమా ఏకంగా 23 కోట్లు కలెక్ట్ చేసి టైర్ 2 హీరోలు ఏ విధంగా కలెక్షన్స్ రాబడతారో ఆ విధంగా రాబట్టింది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో బేబీ సినిమా పోస్టర్స్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఆనంద్ దేవరకొండకు ఆనందమే లేకుండా పోయింది . దానికి కారణం ఈ సినిమాలో పెద్దగా ఆనంద్ దేవరకొండ పాత్ర లేకపోవడం ..సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ ..వైష్ణవి చైతన్యానే కావడం మొత్తం సినిమా కాన్సెప్ట్ అంతా బేబీ చుట్టూనే తిరుగుతూ ఉండడంతో ఎక్కడికి వెళ్లినా సరే వైష్ణవి చైతన్య పోగిడేస్తున్నారు.

అంతెందుకు రీసెంట్గా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వచ్చిన విజయ్ దేవరకొండ సైతం వైష్ణవి చైతన్య ను ఓ రేంజ్ లో పోగిడేశారు . దీంతో హిట్ కొట్టిన సరే ఆనంద్ దేవరకొండకు ఆనందమే లేకుండా పోయింది . అంతేకాదు స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వైష్ణవి చైతన్య చుట్టూ తిరుగుతున్నారు తప్పిస్తే ఆనంద్ దేవరకొండ పేరుని మర్చిపోయారు. అంతేకాదు ఈ సినిమాలో వీరాజ్ మరింత స్థాయిలో హైలెట్ కావడం ఆనంద్ దేవరకొండకు మైనస్ అయింది..!!