నటి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2019 లో విడుదల అయిన ‘మల్లేశం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అమ్మడు. ఈ సినిమా లో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనన్య. దాంతో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్ ‘ సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో మరింత ఫేమస్ అయింది ఈ చిన్నది. వకీల్ సాబ్ సినిమా తరువాత కూడా అనన్య కి అన్ని చిన్న చిన్న పాత్రలే వచ్చాయి కానీ లీడ్ రోల్స్ ఏమి రాలేదు.
సమంత లీడ్ రోల్ లో నటించిన ‘శాకుంతలం ‘ సినిమా లో కూడా అనన్య ఒక మంచి పాత్రలో నటించి ప్రేక్షకులను అల్లరించింది. ఈ అమ్మడు లో మంచి టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ కి తగ్గ అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవలే విడుదల అయిన ‘ బేబీ ‘ సినిమా హీరోయిన్ వైష్ణవి కి కూడా మంచి సక్సెస్ రావడానికి 8 ఏళ్ళు పట్టింది. అలానే అనన్య కూడా ఏదో ఒక రోజు మంచి అవకాశం దక్కించుకుంటుందని ఫ్యాన్ ఆశిస్తున్నారు. అదే నమ్మకంతో అనన్య కూడా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ అల్లరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది కొన్ని ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఆ వీడియోస్ లో అనన్య గెంతులు వేస్తూ కనపడింది. ఆ వీడియో చూసిన కొంతమంది అనన్య గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో అంత బరువు ఎలా మోస్తున్నావ్ అంటూ తన బాడీ గురించి బ్యాడ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అనన్య కి కొత్తేమీ కాదు. ఎవరెన్ని కామెంట్స్ చేసిన ఆమె పట్టించుకోకుండా మళ్ళీ సరికొత్త ఫొటోలతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది.