అయ్యన్న తమ్ముడుకు వైసీపీ షాక్..రివర్స్ అవుతారా?

గత ఎన్నికల్లో టి‌డి‌పి కంచుకోటలని సైతం వైసీపీ కూల్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి బలంగా ఉన్న స్థానాల్లో…అలాగే బలమైన నేతలకు జగన్ చెక్ పెట్టారు. వైసీపీ సత్తా చాటింది. అలా వైసీపీ చెక్ పెట్టిన నేతల్లో టి‌డి‌పి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. నర్సీపట్నంలో ఈయన్ని వైసీపీ ఓడించింది. వైసీపీ నుంచి ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించారు.

అలా అయ్యన్నపై పై చేయి సాధించారు. ఇక అయ్యన్నని దెబ్బకొట్టడానికి ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుని వైసీపీలోకి తీసుకున్నారు. దీంతో అయ్యన్న పని అయిపోయిందని వైసీపీ ప్రచారం చేసింది. కానీ దానికి విరుద్ధంగా అయ్యన్న మళ్ళీ కష్టపడ్డారు. వైసీపీపై పోరాటం చేస్తూనే నర్సీపట్నంలో బలపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకతని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే నర్సీపట్నంలో అయ్యన్న మళ్ళీ రేసులోకి వచ్చేశారు. ఇక ఇప్పుడు ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు కూడా రివర్స్ అయ్యేలా ఉన్నారు.

ఈయనకు, ఎమ్మెల్యేకు పడటం లేదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఇదే సమయంలో డీసీసీబీ చైర్‌పర్సన్‌ పదవి నుంచి సన్యాసి పాత్రుడు భార్య చింతకాయల అనితని తప్పించారు.ఆమె పదవి కాలం ముగియడంతో ఆమెని తప్పించి..ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన కోలా గురువులుకు పదవి ఇచ్చారు.

అయితే ఇటు ఎమ్మెల్యేతో పడటం లేదు..అటు పదవి పోయింది. ఈ నేపథ్యంలో సన్యాసిపాత్రుడు రివర్స్ గేర్ వేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆయన సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక సీటు దక్కితే పర్లేదు..లేదంటే సన్యాసిపాత్రుడు జంప్ అయ్యే ఛాన్స్ ఉంది.