నటి ప్రగతి చేసిన పనికి షాక్ లో ఫ్యాన్సే.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. గతంలో కొన్ని చిత్రాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేకపోయింది దీంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చి అమ్మగా, అక్కగా ,వదిన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. తనదైన యాస డైలాగులతో యాక్టింగ్ తో నవ్వించే ప్రగతి సోషల్ మీడియాలో ఎప్పటికీ ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. ఒకవైపు నటిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే మరొకవైపు జిమ్ వర్క్ అవుట్లతో బాగా కసరత్తు చేస్తూ ఉంటుంది.

అయితే ప్రగతి జిమ్ వర్కౌట్లు కేవలం సరదా కోసమే చేస్తోందని చాలామంది అనుకున్నారు.కానీ ఇప్పుడు అసలు విషయాన్ని బయట పెట్టడం జరిగింది.. హైదరాబాదులో పుట్టి పెరిగిన ప్రగతి డిగ్రీ చదువుకునే వయసులోనే హీరోయిన్గా తమిళ సినిమాలలో నటించింది అలా ఐదు సినిమాలలో నటించిన ఈమె ఒక మలయాళం చిత్రంలో కూడా నటించింది.ఆ తర్వాత వివాహం కావడంతో కొద్దిరోజులు సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాతే సీరియస్లో నటించడం మొదలుపెట్టిన ప్రగతి కొన్నేళ్ళకు సినిమాలలో కూడా సహాయ పాత్రలలో నటిస్తోంది.

మొదట మహేష్ బాబు నటించిన బాబి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిజీయస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం ప్రగతి ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది నిజంగా పవర్ లిఫ్టింగ్ గా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చింది.. తన కొత్త జర్నీ మొదలయ్యింది.రెండు నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అసలు ఊహించలేదు పవర్ లిఫ్టింగ్ లో నా కొత్త ప్రయాణం ఇది అంటూ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది అంటూ రాసుకుంది ఈ వీడియో చూసిన అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.