నెల్లూరుపై టీడీపీ పట్టు..కానీ అవే చిక్కులు.!

వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాపై టి‌డి‌పి నిదానంగా పట్టు సాధిస్తుంది. అక్కడ వైసీపీపై వ్యతిరేకత…కీలకమైన ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు రావడం, ఇటు నారా లోకేష్ పాదయాత్రతో నెల్లూరుపై టి‌డి‌పి పట్టు సాధించే దిశగా వెళుతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 10 సీట్లు గెలుచుకున్న సరే నెల్లూరుకు వైసీపీ పెద్దగా చేసిందేమి లేదు.

దీంతో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో వైసీపీలో అభివృద్ధి జరగడం లేదని, పనులు సరిగ్గా చేయడం లేదని ఆ పార్టీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బయటకొచ్చేశారు. ఆ తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బయటకొచ్చారు. వీరి ముగ్గురిని వైసీపీ సస్పెండ్ కూడా చేసింది. ఇంకా వీరు టి‌డి‌పిలో చేరలేదు. కానీ నారా లోకేష్ పాదయాత్ర జిల్లాలో ఎంటర్ కావడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు వచ్చారు. లోకేష్ పాదయాత్ర విజయవంతం చేసేందుకు పనిచేస్తున్నారు.

ఇప్పటికే ఆత్మకూరులో జరిగిన పాదయాత్ర విజయవంతం చేసేలా ఆనం పనిచేశారు. అటు నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి ఉన్నారు. ఇటు ఉదయగిరిలో మేకపాటి ఉన్నారు. ఇలా టి‌డి‌పికి అనూహ్యంగా పెద్ద మద్ధతు దక్కింది. అదే సమయంలో జిల్లాలో లీడ్ లోకి వచ్చింది. దాదాపు 5 సీట్లలో టి‌డి‌పికి ఆధిక్యం ఉంది. అయితే అంతా బాగానే ఉంది గాని..వైసీపీ నుంచి ఎమ్మెల్యేలతో పాత టి‌డి‌పి కేడర్ కు కాస్త గ్యాప్ కనిపిస్తుంది.

ముఖ్యంగా కోటంరెడ్డి, మేకపాటి విషయంలో..ఎందుకంటే గతంలో వీరు వైసీపీలో ఉంటూ టి‌డి‌పి శ్రేణులని బాగా ఇబ్బంది పెట్టారనే అంశం ఉంది. దీంతో వారికి, టి‌డి‌పి కేడర్ కు గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ గాని పూడిస్తే నెల్లూరులో టి‌డి‌పికి తిరుగుండదు.