హిందీ డబ్బింగ్ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగు పెట్టింది హీరోయిన్ అవికా గోర్.ఈమె మొట్టమొదటిగా చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్ లో తన అమాయకంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఉయ్యాల జంపాల సినిమాతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తరువాత సినిమా చూపిస్త మామ ,ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి పలు చిత్రాలలో నటించి మెప్పించింది.
అవికా గోర్ వెయిట్ పెరగటంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని సన్నబడి రాజు గారి గది 3 చిత్రంలో నటించింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది కానీ అవన్నీ సక్సెస్ కాలేకపోయాయి. పాప్ కార్న్ అనే సినిమాకి ఈమె నిర్మాతగా కూడా చేసింది. అది కూడా ఆమెకు సక్సెస్ దక్కలేదు. నిర్మాతగా అయితే మారింది కానీ డబ్బులు వచ్చాయో లేదో తెలియదు కానీ సినిమా అవకాశాలు మాత్రం పోగొట్టుతుంది.
అయితే అప్పట్లో సావిత్రి, విజయశాంతి వంటి స్టార్ హీరోయిన్స్ కూడా నిర్మాతగా రంగ ప్రవేశం చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్లే ఇప్పుడు ఈ లిస్టులో అవిక గోర్ కూడా చేరిందనే చెప్ప వచ్చు.. అయితే ఆమె డబ్బులు పోగొట్టుకున్న తర్వాత తొందరగా రియలైజ్ అయి నిర్మాణ రంగానికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.. చాలామంది ఫస్ట్ గా హీరో హీరోయిన్ల గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాతగా నిర్మాతలుగా మారిన వారు చాలామందే ఉన్నారు.. అందులో సక్సెస్ చాలా తక్కువ మంది అందుకున్నారు.త్వరలో ఈమె 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణ రంగానికి గుడ్ బై చెప్పడంతో అభిమానులు ఒక్క సినిమాకే ఈ ముద్దుగుమ్మ భయపడిపోయిందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.