ఆది పురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. వారి అంచనాల మధ్య నిన్నటి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది టాక్ పరంగా పాజిటివ్ టాకు వచ్చిన ఏ విధంగా కలెక్షన్లు రాబడతాయి అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ ఈ సినిమా అత మంచి పేరు సంపాదించినట్లుగా తెలుస్తోంది.

Adipurush Release, Cast, Controversy and A 500-Crore Budget
మొదటిరోజు కలెక్షన్ల లెక్కల విషయానికి వస్తే ఆది పురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిందీలో ఒక్కటే మొదటి రోజు రూ .50 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. షారుక్ ఖాన్ పఠాన్ తర్వాత ఈ సినిమాకి అత్యధికంగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర భాషలలో కూడా దాదాపుగా రూ .50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ప్రభాస్ కృతి సనన్ ఈ చిత్రంలో నటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.120 కోట్ల నుంచి రూ.140 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఇక రేపటి రోజున వీకెండ్ కావడంతో భారీగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.విదేశాలలో కూడా ఆది పురుష్ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది.అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఈ సినిమా పలు రికార్డులను సైతం బద్దలు కొడుతున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఈ సినిమా రూ.150 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు దాటే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.దాదాపుగా 9వేలకు పైగా స్క్రీన్ లలో ఈ సినిమా విడుదల అయింది. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రూ .30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ .240 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర బృందం అధికారికంగా మొదటి రోజు కలెక్షన్ ని ప్రకటిస్తుందేమో చూడాలి మరి.