మళ్లీ అదే తప్పు చేస్తూ కెరియర్ నాశనం చేసుకుంటున్న త్రిష..!!

కోలీవుడ్ హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. గతంలో కొన్నేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకోవాలని నిశ్చితార్థం వరకు వెళ్లి కొన్ని కారణాల చేత ఆ వివాహాన్ని రద్దు. ఆ తర్వాత మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంది త్రిష. తాజాగా త్రిష గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Why Did Trisha Delete Her Instagram Pictures?
గతంలో చిరంజీవికి జోడిగా త్రిష స్టాలిన్ చిత్రంలో నటించింది. ఇప్పుడు తాజాగా మరొక చిత్రంలో కూడా నటించేందుకు సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా సిద్దు జొన్నలగడ్డకు తల్లిగా త్రిష నటించబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రాన్ని పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తమిళ చిత్రమైన కామెడీ బ్రో డాడీని చిరంజీవి రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఒరిజినల్గా ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా పృథ్వీరాజ్ తల్లిదండ్రులుగా కనిపించడం జరిగింది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది.

తెలుగులో ఈ చిత్రంలో చిరంజీవి త్రిష సీనియర్ లీడ్ ను పోషించబోతున్నట్లు సమాచారం. సిద్దు జొన్నలగడ్డ, శ్రీ లీల జూనియర్ లేడ్ ను పోషిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు త్రిష హీరోయిన్ లీడ్ రోల్స్ నే పోషించింది. 28 ఏళ్లు ఉన్న సిద్దు జొన్నలగడ్డకు 40 ఏళ్ల వయసులో త్రిష తల్లిగా నటించడానికి అంగీకరించడంతో పలువురు అభిమానులు తీవ్ర ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇలాంటివి ఒప్పుకోవడం వల్ల తన సినీ కెరియర్ నాశనం అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కేవలం రెమ్యూనరేషన్ కోసమే త్రిష ఇలాంటి పనిచేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.