కాంగ్రెస్‌లో వలసల జోరు..భారీగా క్యూలో..ఆఫర్లతో జంపింగ్.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు చాలా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి రేసులోకి వచ్చింది. బి‌జే‌పిని వెనక్కి నెట్టి దూసుకొచ్చింది. పైగా బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా భావించి కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు కీలక నేతలు చూస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కే ఛాన్స్ లేదనుకునే నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

వారికి మంచి ఆఫర్ ఇస్తే జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. వీరికి మంచి ఆఫర్లే వచ్చాయని తెలిసింది. అటు బి‌ఆర్‌ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ వైపు వస్తున్నారని తెలిసింది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఉన్నచోట..ముందు నుంచి ఉన్న బి‌ఆర్‌ఎస్ నేతలు..కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

ఉదాహరణకు నకిరేకల్ లో కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య గెలిచారు..ఆయన బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. అక్కడ బి‌ఆర్‌ఎస్ నుంచి ఓడిన నేత ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అలాగే ఐదుగురు జెడ్పీ చైర్‌పర్సన్లు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారట. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో భారీగా నేతలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారట.

అయితే కాంగ్రెస్ లో సీటు ఇస్తేనే జాయిన్ అవుతామనే వారు ఎక్కువ ఉన్నారు. అలా అని వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వడం కష్టం. మరి చూడాలి బలమైన నేతలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని సీటు ఇస్తారేమో.