సోలోగానే పవన్..సీఎం ఫిక్స్..స్ట్రాటజీ అదేనా?

మొత్తానికి ఏపీలో పొత్తుల అంశం మళ్ళీ పక్కకు వెళ్లింది. మొన్నటివరకు పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టి‌డి‌పి, జనసేన పొట్టి ఫిక్స్ అని..ఇక వీటితో బి‌జే‌పి కలిస్తే కలుస్తుంది లేదంటే లేదు..టి‌డి‌పి, జనసేన పొత్తులో మాత్రం పోటీ చేస్తాయని, పవన్ సైతం సి‌ఎం సీటుపై ఆశ లేదని చెప్పేశారు కాబట్టి పొత్తు సెట్ అని అంతా అనుకున్నారు. పవన్ సైతం జగన్‌ని గద్దె దించడానికి పొత్తు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు.

అలా పొత్తు తప్పనిసరి అని చెప్పి..ఇప్పుడు సింగిల్ గానే పవన్ ముందుకెళ్లెలా రాజకీయం చేస్తున్నారు. వారాహి యాత్రలో తనకు సి‌ఎంగా అవకాశం ఇవ్వాలని, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి..ఏపీని అభివృద్ధి చేసి నెంబర్ 1 స్థానంలో పెడతానని అంటున్నారు. అంటే పొత్తులతో సంబంధం లేకుండా పవన్ తానే సి‌ఎం అని, జనసేన ప్రభుత్వమని మాట్లాడుతున్నారు. అటు చంద్రబాబు సైతం టి‌డి‌పి 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యమని అంటున్నారు. దీంతో అసలు పొత్తు ఉంటుందా? ఉండదా? అనే డౌట్ వస్తుంది.

బాబు, పవన్ కలిసి కొత్తగా ఏమైనా వ్యూహం వేశారా? లేక నిజంగానే పొత్తులో పోటీ చేయకూడదని అనుకుంటున్నారా? అనేది తెలియదు. అయితే అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం..ఆ మధ్య పవన్ సి‌ఎం సీటు వదులుకోవడానికి సిద్ధమని చెప్పడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. అలా అయితే తామే ఓట్లు వేయమని అన్నారు.

దీంతోనే పవన్ పొత్తుల గురించి మాట్లాడకుండా సొంతంగా ముందుకెళ్లెలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. అందుకే సి‌ఎం, జనసేన ప్రభుత్వమని అంటున్నారు. ఎన్నికల ముందు వరకు సొంతంగా బలపడే ఆలోచన చేసి..ఎన్నికల సమయంలో పొత్తులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ లోపు జనసేన బలపడితే ఇంకా ఎక్కువ డిమాండ్ చేయవచ్చు. ఆ ప్లాన్ తోనే పవన్ ఉన్నట్లు తెలుస్తుంది.