బాల‌య్య సాంగ్ కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన కాజ‌ల్‌-శ్రీ‌లీల‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

సీనియ‌ర్ స్టార్ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్‌, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల క‌లిసి ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `భ‌గ‌వంత్ కేసరి`. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో హీరోయిన్ గా కాజ‌ల్ న‌టిస్తుంటే.. ఓ కీల‌క పాత్ర‌ను శ్రీ‌లీల పోషిస్తోంది.

షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌.. భ‌గ‌వంత్ కేస‌రిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డేలా చేశాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో అనిల్ రావిపూడి బాల‌య్య హిట్ సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చి ఎంత‌లా ట్రెండ్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఈ సారి కాజ‌ల్‌, శ్రీ‌లీల వంతు వ‌చ్చింది. బాలకృష్ణ `చికలపచ్చ కొక` పాటకు కాజ‌ల్‌, శ్రీ‌లీల అదిరిపోయే స్టెప్పులు వేసి డ్యాన్స్ ఇర‌గ‌దీశాడు. శ్రీ‌లీల డ్యాన్స్ కు వంక‌లు పెట్ట‌క్క‌ర్లేదు. అయితే కాజ‌ల్ కూడా దుమ్ము దులిపేసింది. పెళ్లై ఓ బిడ్డ‌కు త‌ల్లైనా స‌రే.. గ్రేస్ ఫుల్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. అన్న‌ట్లు ఈ వీడియోలో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు.