సీమలో లోకేష్ పెద్ద టార్గెట్..టీడీపీ రీచ్ అవుతుందా?

ఈ సారి రాయలసీమలో మంకీ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా టి‌డి‌పి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని ఎన్నికల నుంచి సీమలో టి‌డి‌పి దారుణ పరాజయాలని చవిచూస్తుంది. 2014 ఎన్నికల్లో కాస్త బెటర్ ఫలితాల్ఊ వచ్చాయి గాని..వైసీపీ ఆధిక్యాన్ని అపలేకపోయింది. 2019 ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం మూటగట్టుకుంది. సీమలో ఉన్న 52 సీట్లలో వైసీపీ 49 సీట్లు గెలుచుకుంటే, టి‌డి‌పి కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

అయితే ఇప్పుడు ఆ పరిస్తితి నిదానంగా మారుతుంది. టి‌డి‌పి బలపడుతుంది. వైసీపీపై కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర టి‌డి‌పికి పెద్ద ప్లస్ అవుతుంది. వంద రోజుల పై నుంచి లోకేష్..సీమలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు..ఇప్పుడు కడప జిల్లాలో లోకేష్ పాదయాత్ర సాగుతుంది. లోకేష్ పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజా స్పందన వస్తుంది. అదే సమయంలో సీమ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీకి అన్నీ సీట్లు ఇచ్చిన సీమకు చేసిందేమి లేదని, ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని..నాలుగేళ్లలో సీమ రూపురేఖలు మారుస్తామని ఒకవేళ అలా చేయకపోతే కాలర్ పట్టుకుని నిలదీయండి అని లోకేష్ అంటున్నారు. ఈ సారి 49 సీట్లు తమకు ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే లోకేష్ అనుకుంటున్న టార్గెట్ రీచ్ అవ్వడం అసాధ్యమైన పని. సీమలో ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యం ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.

అయితే టి‌డి‌పి ఇంకొంచెం కష్టపడితే ఆధిక్యం సాధించవచ్చు. మొత్తం 52 సీట్లు ఉంటే ప్రస్తుతానికి టి‌డి‌పికి 20 సీట్లలోనే లీడ్ కనిపిస్తుంది. ఈ బలం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.అలా పెంచుకుంటే 30 సీట్లు వరకు గెలుచుకోవచ్చు గాని..49 సీట్లు సాధ్యం కాదు.