జోరు తగ్గించిన శ్రీముఖి.. కారణం అదేనా..?

తెలుగు బుల్లితెర పై యాంకర్ రాములమ్మగా పేరుపొందింది యాంకర్ శ్రీముఖి.. ఒకప్పుడు ఏ ఛానల్లో చూసిన ఎక్కువగా శ్రీముఖి సందడి చేస్తూ కనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో కాస్త కనిపించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా బిగ్ బాస్ వల్ల ఒకదానిలో చేసేవారు మరొకదానిలో చేయడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఛాన్సులు అంతా యాంకర్ ని బుల్లితెర నటులను పంచుకున్నట్టు అయిందని చెప్పవచ్చు.. బిగ్ బాస్ నుంచి శ్రీముఖి వెళ్ళి వచ్చాక శ్రీముఖి తన యాంకర్ కొనసాగించిన తను మార్పును చూపించుకోవడంలో సక్సెస్ కాలేక పోయింది.

Sreemukhi Biography, Wiki, Age, Bigg Boss, Height, Caste, Family
ప్రస్తుతం ఈ అమ్మడు జీ తెలుగు సింగర్ షోలో చేస్తోంది. ఈ మధ్యన మరో సీజన్ ని కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఇవే కాకుండా స్టార్ మా లో ఒక షో చేస్తోంది అయితే అది కూడా అంతగా ప్రేక్షకుల నుండి స్పందన రాలేకపోయినట్లు తెలుస్తోంది. గ్లామర్ ట్రీట్ విషయంలో ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించిన శ్రీముఖి ఆమధ్య అంద చందాలతో తన హవా కొనసాగించింది.. ముఖ్యంగా తన స్కిన్ షో తో కుర్రకారులను తెగ డిస్టర్బ్ చేసింది శ్రీముఖి.

శ్రీముఖి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. గతంలో శ్రీముఖి వివాహం చేసుకోబోతోందని వార్తలు కూడా బాగానే వినిపించాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్ అని తెలియజేసింది. ప్రతిసారి శ్రీముఖి గ్లామర్ షో చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దు గుమ్మ ఎక్కువగా సినిమాల పైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.అందుకే తనకు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తోంది. ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.