దొంగ ఓట్ల జోరు..ఐప్యాక్ క్రియేటివిటీ..!

ఏపీలో ఈ మధ్య దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఏ మీడియాలో చూసిన ఒకే డోర్ నెంబర్ తో వందల ఓట్లు నమోదు అవుతున్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో అర్హులైన కొందరి ఓట్లు తొలగిస్తున్నారని, అది కూడా టి‌డి‌పి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల దొంగ ఓట్ల రావడంపై టి‌డి‌పి నేతలు..తాజాగా ఎన్నికల అధికారికి ఆధారాలతో సహ ఫిర్యాదు చేశారు.

అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం. ఒకే డోర్‌ నంబర్‌లో అనేక మందిని ఓటర్లుగా చేర్చడం.. ఇలా వైసీపీ వాళ్ళు  వివిధ జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో 2,150 డోర్‌ నంబర్లతో లక్షా 85వేల దొంగ ఓట్లు చేర్పించారని టి‌డి‌పి నేతలు ఫిర్యాదు చేశారు. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని దొంగ ఓట్ల నమోదుతో సీఎం జగన సరికొత్త రికార్డులు సృష్టించి, ప్రపంచంలో 8వ వింతను నమోదు చేశారని ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు. ఈ సీఎం, అధికార పార్టీ నేతలు ఏ స్థాయిలో అధికారులను, వ్యవస్థలను ప్రభావితం చేసి, ఓటర్ల జాబితాలను తారుమారు చేశారో సీఈవో దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

తాడికొండ, నందికొట్కూరు, నర్సీపట్నం, అనకాపల్లి, విజయవాడ సెంట్రల్‌, విశాఖ తూర్పు, పశ్చిమ, రాప్తాడు, ఒంగోలు, మదనపల్లె, రాయచోటి, గుంటూరు పశ్చిమ, మచిలీపట్నంలో చోట్ల దొంగ ఓట్లు చేర్పించడంపై ఆధారాలు అందజేశామని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా బీహార్ నుంచి వచ్చిన ఐప్యాక్ టీం..వైసీపీ నేతలు కలిసి ఇదంతా చేస్తున్నారని టి‌డి‌పి నేతలు ఆరోపిస్తున్నారు .

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఐప్యాక్ టీం ఏ విధంగా అధికారం చెలాయిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ ఐప్యాక్ చేసే కార్యక్రమాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం, లేనిది ఉన్నట్లు సృష్టించడం, ఎదుటి వాళ్ల బలహీనతలు, పొరపాట్లను భూతద్దంలో చూపించడం, అన్నింటికంటే ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడం చేస్తూనే…దొంగ ఓట్లు సృష్టించడంలో ముందుందని టి‌డి‌పి నేతలు ఆరోపిస్తున్నారు. ఐప్యాక్ వచ్చాకే రాష్ట్ర రాజకీయాలు నాశనం అయ్యాయని, బూతులు పెరిగాయని..దారునాలు పెరిగాయని అంటున్నారు. చూడాలి ఈ ఐప్యాక్ ప్రభావం ఎన్నికల్లో ఏ మేర ఉంటుందో.