డైరెక్ట‌ర్ శంక‌ర్ కు ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన క‌మ‌ల్‌.. దాని ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాకే!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్ లో శంక‌ర్ ఒక‌డు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. అందులో రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2`. నిజానికి ఇండియ‌న్ 2 మూవీ ఎప్పుడో ఫినిష్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆరంభం నుంచి ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. దాంతో శంక‌ర్ ఈ మూవీని వ‌దిలేసి రామ్ చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ ను షురూ చేశాడు.

అయితే ఇంత‌లోనే ఇండియ‌న్ 2 మేక‌ర్స్ కోర్డును ఆశ్ర‌యించి పెద్ద ర‌చ్చ జ‌రిగిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ శంక‌ర్ ఆ ప్రాజెక్ట్ ను టేక‌ప్ చేశాడు. ఓవైపు గేమ్ ఛేంజ‌ర్ తో పాటు ఇండియ‌న్ 2 షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. 2001లో వ‌చ్చిన `ఇండియ‌న్‌` మూవీకి ఇది సీక్వెల్. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే షూట్ చేసిన కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను తాజాగా క‌మ‌ల్ వీక్షించార‌ట‌. అవి ఆయ‌న‌కు తెగ న‌చ్చేశాయ‌ట‌. దాంతో వెంట‌నే ఆయ‌న డైరెక్ట‌ర్ శంక‌ర్ కు ఖ‌రీదైన వాచ్ ను గిఫ్ట్ గా ప్ర‌జెంట్ చేశారు. ప‌నేరాయ్ ల్యూమినార్ అనే బ్రాండెడ్ వాచ్ ను శంక‌ర్ కు క‌మ‌ల్ బ‌హుక‌రించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను క‌మ‌ల్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. ఇక శంక‌ర్ కు క‌మ‌ల్ హాస‌న్ గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే, ఈ వాచ్ ధ‌ర రూ. 8.77 ల‌క్ష‌లు.