`శివ‌మ‌ణి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని చీప్ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

శివ‌మ‌ణి.. నాగార్జున కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒక‌టి. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అసిన్, రక్షిత హీరోయిన్లుగా న‌టించారు. వైష్ణో అకాడమీ బ్యాన‌ర్ పై ఈ మూవీ నిర్మితం అయింది. డి.వి.వి. దానయ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూడా శివ‌మ‌ణి నిర్మాణంలో భాగం అయ్యారు. చిక్రి ఈ మూవీ స్వ‌రాలు అందించాడు.

యాక్ష‌న్ అండ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2003లో ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తొలి ఆట నుంచే హిట్ టాక్ ను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను సొందం చేసుకుంది. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. శివ‌మ‌ణి మూవీ స్టోరీని పూరీ నాగార్జున కంట ముందే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు.

కానీ స‌ద‌రు హీరో ఈ మూవీని చీప్ రీజ‌న్ తో రిజెక్ట్ చేశాడు. ఇంత‌కీ అత‌ను మ‌రెవ‌రో కాదు విక్ట‌రీ వెంక‌టేష్‌. పూరీ జ‌గ‌న్నాథ్ మొద‌ట వెంకీతోనే ఈ సినిమా చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. ఆయ‌న ఇమేజ్ కు ఈ మూవీ బాగా సూట్ అవుతుంద‌ని పూరీ భావించాడ‌ట‌. అయితే క‌థ విన్న వెంక‌టేస్‌.. సెకండాఫ్ అంత బాగోలేద‌ని, కొన్ని మార్పులు చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. అందుకు పూరీ నో చెప్ప‌డంతో.. తాను ఈ సినిమా చేయ‌న‌ని వెంకీ చెప్పాడ‌ట‌. దాంతో పూరీ జ‌గ‌న్నాథ్ నాగార్జున వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. ఆయ‌నకు క‌థ బాగా న‌చ్చేసింది. అలా వారి క‌ల‌యిక‌లో ప‌ట్టాలెక్కిన శివ‌మ‌ణి బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది.