రాజ‌మౌళి ఫ‌స్ట్ యాడ్ చూశారా.. అదిరిపోయింది అంతే!

`ఆర్ఆర్ఆర్‌` మూవీతో హాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ దృష్టిని కూడా ఆక‌ర్షించిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. ఇటీవ‌ల ఒక యాడ్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి త‌న కెరీర్ లోనే న‌టించిన ఫ‌స్ట్ యాడ్ ఇది. ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పో త‌మ‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని నియ‌మించుకుంది.

అంతే కాదు ఇటీవ‌ల ఓ యాడ్ ఫిల్మ్ చేయ‌గా.. అందులో రాజ‌మౌళి న‌టించారు. తాజాగా ఆ యాడ్ బ‌ట‌య‌కు వ‌చ్చింది. ఒప్పో నుంచి వచ్చిన బెస్ట్ న్యూ ప్రోడక్ట్ `ఒప్పో 10 సిరీస్‌` ప్రమోషన్ కోసం ఈ యాడ్ ను చిత్రీక‌రించారు. ఇందులో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో రాజ‌మౌళి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఈ యాడ్ థీమ్ కూడా అదిరిపోయింద‌నే చెప్పాలి.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఫ‌స్ట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ యాడ్ కోసం రాజ‌మౌళి రూ. 3 నుంచి 4 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేశాడ‌నే టాక్ ఉంది. అంతేకాదు ఈ యాడ్ వల్ల జక్కన్న ఖాతాలో మ‌రిన్ని బ్రాండ్స్ వ‌చ్చి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కాగా, ప్ర‌స్తుతం ఫ్యామిలీతో వెకేష‌న్ లో ఉన్న రాజ‌మౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్ బాబుతో చేయ‌బోతున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

https://www.instagram.com/reel/CuCT4WIreYb/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==