`ఆదిపురుష్`కు బిగ్ షాక్‌.. అక్క‌డ 50 టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదా?

రామాయణం లాంటి అద్భుత‌ దృశ్య‌ కావ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ డ్రామా `ఆదిపురుష్‌` ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాదాపు 7000 థియేట‌ర్స్ లో ఈ చిత్రం విడుద‌ల అయింది. ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు.

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి చాలా వ‌ర‌కు పాజిటివ్ రివ్యూలే వ‌స్తున్నాయి. ఈ విజువల్ యాక్షన్ డ్రామా బాగానే ఆకట్టుకుంది. ప్రభాస్, కృతి సనన్ ల నటన, 3డి ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్‌ బాగున్నాయ‌ని చాలా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌పోతే బుకింగ్స్ ప‌రంగా ఆదిపురుష్‌ వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో కుమ్మేస్తూ దూసుకు పోతుంది.

హిందీ, తెలుగు లో సినిమా బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా జ‌రుగుతున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఈ సినిమాకు బిగ్ షాక్ త‌గిలింది. తమిళ వెర్షన్ బుకింగ్స్ మేక‌ర్స్ ను తీవ్రస్థాయిలో నిరాశపరుస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 20 శాతం టికెట్స్ మాత్ర‌మే అమ్ముడైనట్లు మాట్లాడుకుంటున్నారు. అలాగే ఓవర్సీస్ లో ఆదిపురుష్ తమిళ వెర్షన్ టికెట్లు 50 కంటే తక్కువే అమ్ముడు అయ్యార‌ని టాక్ న‌డుస్తోంది. మొత్తానికి త‌మిళ ప్రేక్షకులు ఇతర భాషలకు చెందిన సినిమాలపై ఇంట్రెస్ట్ చూప‌డం లేద‌ని ఆదిపురుష్ మూవీతో మ‌రోసారి రుజువు అయింది.