వామ్మో.. ఆ ఒక్క సాంగ్ కోసం భారీగా రెమెన్యూరేషన్ పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ?

సెక్సీ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా బాలీవుడ్ భామ అయినటువంటి ఈ చిన్నది మెల్ల మెల్లగా టాలీవుడ్‌లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్లో మొదట హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఈ అమ్మడు తరువాతి కాలంలో ప్రత్యేక గీతాలతో అలరిస్తూ తనదైన మార్కుని కనబరుస్తోంది. కాగా ఈమధ్య తెలుగు సినిమాలలో కూడా ప్రత్యేక గీతాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన పాపులారిటీని పెంచుకొనే పనిలో పడింది.

మరీ ముఖ్యంగా, వాల్తేరు వీరయ్య సినిమాలో ఆమె చేసిన ‘వేర్ ఈజ్ ది పార్టీ’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా స్పందన వచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో తెలుగులో ఫాలోయింగ్ ఏర్పడటంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి ఊర్వశీపై పడింది. దాంతో తాజాగా బోయపాటి శ్రీను.. రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇందులో కూడా ఊర్వశి ప్రత్యేక గీతంలోనే చేస్తోందని సమాచారం.

కాగా అమ్మడు ఈ సాంగ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని వినికిడి. ఈ ఐటెం సాంగ్ కోసం ఈ బ్యూటీ ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆమె పాపులారిటీని చూసి మేకర్స్ కూడా అంత మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. గతంలో మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య పాట కోసం ఊర్వశి రూ.2 కోట్లు తీసుకోగా.. ఇప్పుడు రామ్ చిత్రం కోసం ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేయడం ఫిల్మ్ పండితులను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. కాగా ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share post:

Latest