స్పై థ్రిల్లర్ మూవీస్ కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అడవి శేషు నటించిన ‘గూఢచారి’ సినిమా నుంచి ఈ మధ్య షారుఖ్ ఖాన్ నటించిన ‘ పఠాన్ ‘ సినిమా వరకూ స్పై థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ సినిమాలకు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఆడియన్స్ అందరూ ఎగబడి చూస్తారు. తాజాగా ఇంకో స్పై థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఆ సినిమా పేరు ‘గ్రే ‘. బుల్లితెర నటుడు అలీ రెజా, అరవింద్ కృష్ణ, ప్రతాప్ పోతన్, ఊర్వశిరాయ్ లాటి నటినటులు ప్రధాన పాత్రలో నటించారు.
రాజ్ మధిరజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కిరణ్ కాళ్ళకురి నిర్మించారు. ‘ధ స్పై హూ లవ్డ్ మీ ‘ అనే ట్యాగ్ లైన్‌తో తీసిన ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు కూడా ఎంపిక అయింది. కానీ మే 26న ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించడమే దీని ప్రత్యేకత. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించిన ఏకైక సినిమా ‘ గ్రే ‘.
ప్రముఖ సీనియర్ నటి రాధిక మొదటి భర్త ప్రతాప్ పొతాన్ నటించిన చివరి సినిమా ‘గ్రే ‘. కొన్నేళ్ల క్రితం ఇండియాలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12 మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఈ ఘటన అంతకుముందు చాలా సార్లు జరిగింది. దీనికి కారణం ఫారెన్ ఇంటెలిజెన్స్ వారు చాలా జాగ్రత్తగా వారి ఆపరేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఆ కథ ఆధారంగా తీసుకొని తీసిన సినిమానే ‘ గ్రే ‘. రెండేళ్లు ఎంతో కష్టపడి రూపొందించిన గ్రే సినిమాని ఎటువంటి హంగు ఆర్బటాలు లేకుండా రిలీజ్ చెయ్యడం వల్ల ప్రయోజనం ఏం ఉంటుంది. సినిమా కి మంచి ప్రమోషన్స్ చేసి ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.