తెలుగు వెండితెర సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ రిలీజ్ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో మే 31న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా స్క్రీనింగ్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ లో కూడా 2 షో లను ప్లాన్ చేశారు. డిమాండ్ ను బట్టి ఈ షోలను మరియు థియేటర్లను పెంచే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ సినిమా అప్పట్లో 7 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఇప్పుడు దానిని 4 కే టెక్నాలజీలోకి మార్చడానికి దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని వినికిడి.
ఇకపోతే మోసగాళ్లకు మోసగాడు సినిమాకి వెళ్లిన వారు సర్ ప్రైజ్ అయ్యే విధంగా మహేష్ బాబు తాజా సినిమా యొక్క గ్లిమ్స్ ను థియేటర్ లో స్క్రీనింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ హీరో యొక్క సినిమా గ్లిమ్స్ ను ఇలా థియేటర్ లో స్క్రీనింగ్ చేయలేదు. దాంతో ఇది రికార్డ్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా తెలుగులో వచ్చిన మొదటి కౌ బాయ్ ఫిల్మ్ మన సూపర్ స్టార్ కృష్ణ గారిదే. ఈ సినిమాలో కృష్ణకి, జోడీగా విజయ నిర్మల నటించగా కేఎస్‌ఆర్ దాస్ దీనికి దర్శకత్వం వహించారు.
ఇక రీ రిలీజ్ సందర్భంగా ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి విదితమే. సూపర్ స్టార్ మహేష్ ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. షార్ట్ అండ్ స్వీట్‌గా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటం విశేషం. కాగా ఈ సినిమా అప్పట్లో 60దేశాలకుపైగా రిలీజ్ అయ్యింది. దీంతో మొదటి తెలుగు పాన్ ఇండియా మూవీ అని కొంతమంది దీనిని కీర్తిస్తున్నారు. ఈ సినిమా 18వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో బొబ్బిలి ప్రాంతంలో జరిగిన కథగా తెరకెక్కగా, అమరవీడు వంశానికి చెంది, కనిపించకుండా పోయిన ఓ నిధి చుట్టూ ఈ సినిమా కథ మొత్తం తిరుగుతుంది.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్… 1 టికెట్ పై 2 సినిమాలు?
