అన్న‌తో విడాకులు తీసుకుని త‌మ్ముడి సినిమాకు సైన్ చేసిన స‌మంత‌.. ఇదేం విడ్డూరం రా సామి!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత కొద్ది నెల‌ల క్రిత‌మే అక్కినేని నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి.. వైవాహిక బంధానికి స్వ‌స్థి ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్ల‌కు విడిపోయి ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. అయితే అన్న‌తో విడాకులు తీసుకున్న స‌మంత‌.. ఇప్పుడు విడ్డూరంగా ఆయ‌న త‌మ్ముడు అఖిల్ సినిమాకు సైన్ చేసింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

`ఏజెంట్` వంటి డిజాస్ట‌ర్ అనంత‌రం అఖిల్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చరణ్ తన ఫ్రెండ్ మ‌రియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పార్ట్నర్స్ లో ఒకరైన విక్రమ్ రెడ్డితో కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. ‘వి మెగా పిక్చర్స్’ (V Mega Pictures) అని పేరుతో బ్యాన‌ర్ ను ప్రారంభించారు.

అయితే ఈ బ్యాన‌ర్ లో మొద‌టి సినిమాను అఖిల్ తో చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సాహో, రాధేశ్యామ్ చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన అనిల్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ఇందులో స‌మంత న‌టించ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని అంటున్నారు. నాగ‌చైత‌న్య‌తో విడిపోయినా స‌రే అఖిల్ తో స‌మంత‌కు మంచి బాండింగ్ ఉంది. అందుకే వెంట‌నే అత‌డి సినిమాకు సైన్ చేసింద‌ట‌. మ‌రి ఇందులో ఆమె హీరోయిన్‌నా లేక ఏదైన కీల‌క పాత్ర‌ను పోషిస్తుందా అన్న‌ది చూడాలి.

Share post:

Latest