కృతి శెట్టి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్‌.. ఇక ఇక్కడ బేబ‌మ్మ క‌నిపించ‌డం క‌ష్ట‌మే అట‌!?

ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఎంతటి సెన్షేన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప్పెనలా దూసుకువచ్చిన కృతి శెట్టి.. టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

కెరీర ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా.. ఆ తర్వాత వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, రీసెంట్ గా క‌స్టడీ ఇలా కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. దాంతో గోల్డెన్ లెగ్ అన్నవారే కృతి శెట్టిని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇలాంటి తరుణంలో కృతి శెట్టి ఫాన్స్ ను కలవర పెట్టే బ్యాడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

అదేంటంటే.. ఇకపై ఇక్కడ బేబమ్మ కనిపించడం కష్టమే అట‌. వ‌రుస‌ ఫ్లాపులు, పైగా పోటీ ఎక్కువ‌గా ఉండ‌టం కారణంగా కృతి శెట్టి టాలీవుడ్ కు గుడ్ బై చెప్పాలని భావిస్తుందట. తెలుగు సినిమాల‌ను పక్కనపెట్టి తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల‌పై దృష్టి సారించాలని ఆమె నిర్ణయించుకుందట. ఇప్పటికే మలయాళంలో ఓ బిగ్‌ ప్రాజెక్టులో కృతి శెట్టి భాగమైంది. అలాగే తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసింది. అంతేకాదు, ఆయా భాషల్లో మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని టాక్ నడుస్తోంది.

Share post:

Latest