నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమా.. ఊహించని షాక్

ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునే ఏకైక టాపిక్ నరేష్, పవిత్రల గురించి. వారిద్దరూ కలిసి నటించిన “మళ్లీ పెళ్లి” సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మళ్లీ పెళ్లి సినిమా చాలా బోరింగ్ గా ఉందని, సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకొని థియేటర్‌లో చూడటానికి వెళ్ళిన వారు నీరాజు చెందక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, శుక్రవారం రోజు చాలా సినిమాలు థియేటర్లో విడుదల కావడం వల్ల మళ్లీ పెళ్లి సినిమాకి కలెక్షన్ల పరంగా కూడా ఎఫెక్ట్ పడిందని చెప్పాలి.

నరేష్, పవిత్రల నిజజీవితం గురించి పూర్తిగా తెలిసినవారు థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ మళ్ళీ పెళ్లి సినిమా సారాంశం చాలా సింపుల్ గా ఉంటది. అదేంటంటే, నరేష్, పవిత్రలు ఇప్పుడు లివింగ్ రిలేషన్ లో ఉన్నారట. అందులో వారి తప్పు ఏం లేదట. వారు పెళ్లి చేసుకున్న వ్యక్తుల టార్చర్ వల్లనే పవిత్ర, నరేష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ సినిమా తీశారని తెలుస్తోంది.

అయితే థియేటర్లలో ఈ సినిమాను పెద్దగా ఆదరించకపోయినా ఓటీటీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చుతుందని చాలామంది అంటున్నారు. ఇక ఈ సినిమా నిర్మాత నరేష్ కు భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇది వారి బయోపిక్ మూవీ కాదని వాళ్ళు చెప్తున్నా సరే, సినిమా చూస్తే మాత్రం క్లియర్‌గా ఇది బయోపిక్ మూవీ అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా గురించి నరేష్ భార్య రమ్య రఘుపతి, పవిత్ర భర్త ఎలా స్పందిస్తారో చూడాలి.

Share post:

Latest