పెళ్లైన‌ 2 ఏళ్ల‌కే విడాకుల బాట ప‌ట్టిన స‌మంత ప్రియుడు.. వైర‌ల్ గా మారిన ట్వీట్‌!

సమంత ప్రియుడు, బాలీవుడ్ స్టార్‌ పెళ్లైన‌ రెండేళ్లకే విడాకుల బాట పట్టాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు వ‌రుణ్ ధావన్. సమంత, వరుణ్ ధావ‌న్‌ జంటగా ప్రస్తుతం `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హై ఓల్టేజ్ యాక్ష‌న్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వ‌హిస్తున్నారు.

ఈ సంగ‌తి ప‌క్క‌న పోడితే.. వరుణ్ ధావన్ కు సంబంధించి ఓ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. వ‌రుణ్ ధావ‌న్ త‌న భార్య‌కు విడాకులు ఇవ్వ‌బోతున్నాడు అన్న‌దే ఆ ట్వీట్ సారాంశం. రెండేళ్ల క్రితం నటాషా అనే అమ్మాయితో వ‌రుణ్ ఏడ‌డుగులు వేశాడు. వీరిది ప్రేమ వివాహం. అప్ప‌ట్లో వీరి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

అయితే ప‌బ్లిసిటీ కోసం సినీ తార‌ల‌పై వివాదాస్ప‌ద ట్వీట్స్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్‌ సంధు తాజాగా వ‌రుణ్ ధావ‌న్ ను టార్గెట్ చేశాడు. `వరుణ్ ధావన్, నటాషా ఇద్దరిమధ్య చెడింది. వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్‌ అయ్యారు` అని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈ ట్వీట్ పై వ‌రుణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉమైర్ సంధును బూతుల‌తో ఏకేస్తున్నారు.

https://twitter.com/UmairSandu/status/1661373867997159424?s=20

Share post:

Latest