హీరో రవితేజ నటించిన కిక్ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా ఇందులో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో రవితేజ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలో ఇలియానా చెల్లెలుగా నటించింది ఒక ముద్దుగుమ్మ. ఈమె పేరే ఆషికా బతిజా. ఈమె నటించింది చిన్న పాత్రలో నైనా సరే ఎంతో అద్భుతంగా నటించింది.
ఇక రెండు మూడు సన్నివేశాలలో ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు కలిసి రాలేదని చెప్పవచ్చు. కిక్ సినిమా తర్వాత ఈమె మరే తెలుగు సినిమాలో కూడా నటించలేదు.ఆషికా బతిజా చదువుల కోసం లండన్ కి వెళ్లి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మోడలింగ్ వైపుగా అడుగులు వేస్తూ అక్కడే స్థిరపడిపోయినట్లు సమాచారం. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఆషికా బతిజా బ్లాక్ డ్రెస్సులు తన అందాలను చూపిస్తూ పలు రకాల బంగిమలు ఫోటోలను షేర్ చేయడం జరిగింది. గతంలో కంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగా తయారయ్యింది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ రేంజ్ లో అందాలు కొలకపోస్తున్నప్పటికీ సరైన అవకాశాలు మాత్రం రాబట్టుకోలేకపోతోంది. మరి రీయంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.