కీర్తి సురేష్ లవ్ ఎఫైర్ల పైన షాకింగ్ కామెంట్స్ చేసిన తండ్రి..!!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో హీరోయిన్ కీర్తిసురేష్ కూడా ఒకరు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ్ భాషలలో పలు చిత్రాలలో నటిస్తోంది. ఇటీవలే దసరా సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించి మంచి విజయాన్ని అందుకుంది. డి గ్లామరస్ పాత్రలలో నటించి మంచి విజయాలను అందుకున్న కీర్తి సురేష్ పైన తరచు పెళ్లి లవ్ ఎఫైర్ రూమర్ల పైన పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంపై తాజాగా కీర్తి సురేష్ తండ్రి స్పందించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Father's Day 2020: Exclusive! 'I inherited a lot of my dad's qualities,'  says Keerthy Suresh | Tamil Movie News - Times of India

పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్ మలయాళం లో కూడా రెండు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండు రోజుల క్రితం ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. అందులో ఉన్న వ్యక్తి కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు పుట్టుకొచ్చాయి ఈ విషయంపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది తను నా బెస్ట్ ఫ్రెండ్ ఫర్హాన్ అని తెలిపింది.

కీర్తి సురేష్ లవర్ అండ్ సాగిన వార్తలపై ఆమె తండ్రి నిర్మాత సురేష్ స్పందించారు..కీర్తి సురేష్ ఎవరితో లవ్లో లేదని ఆమె బర్త్డే రోజున ఫ్రెండుతో దిగిన ఫోటోలపై అలా తప్పుడు ప్రచారం చేశారంటూ తెలిపారు.ఆ అబ్బాయి తమకు బాగా తెలుసు అని ఒకవేళ కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కచ్చితంగా తెలియజేస్తామని తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం వల్ల తమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందని తెలుపుతున్నారు.